• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పుంగనూరుకు నూతన కోర్టు మంజూరు

CTR: పుంగనూరు కోర్ట్ సముదాయంలో రెండవ అదనపు సివిల్‌జడ్జి, జూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ఆఫ్‌ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 3 కోర్టులతో కలిపి పట్టణంలో 4 కోర్టుల్లోను కేసులు పరిష్కరించనున్నారు. కేసులను వేగంవంతంగా పరిష్కరించేందుకు అదనపు కోర్టు మంజూరు కావడంపై న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తపరిచారు.

April 7, 2026 / 08:50 PM IST

ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా మధులత

W.G: ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పెంటపాడుకు చెందిన జనసేన నాయకురాలు కసిరెడ్డి మధులత నియమితులయ్యారు. స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలగడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన నియమాకానికి సహకరించిన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, మద్దిపాటి వెంకట్రాజులకు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు.

April 7, 2026 / 08:43 PM IST

తాగునీటి సరఫరాపై కమిషనర్ తనిఖీలు

KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర బండి కనుమ పంప్ హౌస్, స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ పనితీరును అధికారులతో సమీక్షిస్తూ.. నీటి నాణ్యతపై ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. నగర ప్రజలకు శుద్ధమైన మరియు సమృద్ధిగా తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 08:32 PM IST

మహిళా రక్షణపై అవగాహన కార్యక్రమం

CTR: ఇవాళ చిత్తూరులో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిలు, శక్తి బృందాలతో కలిసి వివిధ ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు భద్రత, రక్షణ, చట్టపరమైన భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలలో తక్షణ సహాయం, అత్యవసర మద్దతు కోసం శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించమని మహిళలను ప్రోత్సహించారు.

April 7, 2026 / 08:32 PM IST

‘క్యూబాకు ఆర్థిక సాయం అందించాలి’

కృష్ణా: మతోన్మాద ట్రంప్ చర్యలను ఖండిస్తూ, క్యూబాకు అండగా నిలబడాలని గుడివాడలో సీపీఎం నేతలు మంగళవారం పిలుపునిచ్చారు. సోషలిస్ట్ దేశమైన అయినా క్యూబాపై గతి అనేక సంవత్సరాలుగా అమెరికా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ, ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆర్.సీపీ రెడ్డి అన్నారు. క్యూబాకు మనమంతా స్వచ్ఛందంగా ఆర్థిక సాయం అందించాలని తెలిపారు.

April 7, 2026 / 08:30 PM IST

అక్రమ మైనింగ్ అధికారులు దాడి

ప్రకాశం: పెద్దచెర్లోపల్లి (M) తుర్కపల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మార్కాపురం మైనింగ్ అధికారులు దాడి చేసి నిల్వ ఉంచిన తెల్ల రాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకొని రెవిన్యూ అధికారులకు అప్పగించినట్లు సమాచారం.

April 7, 2026 / 08:30 PM IST

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: మంద కృష్ణ

GNTR: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తున్న1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇతర మతాల్లోని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నప్పుడు దళితులకే ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు. కుల వ్యవస్థ వల్లనే దేశంలో అసమానతలు పెరిగాయని, దీనికి కారణమైన శక్తులపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

April 7, 2026 / 08:30 PM IST

మాచర్లలో రథోత్సవాన్ని ప్రారంభించిన ఎంపీ

PLD: శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిలకు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం వారికి వేద ఆశీర్వచనాలు అందించి సత్కరించారు.

April 7, 2026 / 08:30 PM IST

గొల్లప్రోలులో అక్రమ PDS బియ్యం పట్టివేత

KKD: గొల్లప్రోలు మండలం అక్రమంగా తరలిస్తున్న 1,200 కేజీల రేషన్(PDS) బియ్యాన్ని మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కె.నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2,55,800 ఉంటుందని అధికారులు వెల్లడించారు.

April 7, 2026 / 08:30 PM IST

వ్యాపారపరంగా చైతన్యవంతమైన ప్రాంతం ఇదే..!

W.G: తాడేపల్లిగూడెం వ్యాపారపరంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతమని కలెక్టర్ నాగరాణి కొనియాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని, గూగుల్ డేటా సెంటర్ స్థాపనే అందుకు నిదర్శనమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశ్రమల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ పాల్గొన్నారు.

April 7, 2026 / 08:28 PM IST

పంచలింగాల పర్యటనలో ఎంపీ

KRNL: కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పర్యటించి అభివృద్ధి పనులను ఇవాళ పరిశీలించారు. ఎంపీ నిధులు, NREGS ద్వారా జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. గ్రామ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, కొత్త పశు వైద్యశాల నిర్మాణం చేపడతామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 7, 2026 / 08:23 PM IST

మీడియాపై దాడిని ఖండించిన కేంద్రమంత్రి

SKLM: మీడియా సంస్థలపై భౌతిక దాడులు చేయడం ద్వారా వైసీపీ తన అరాచక స్వభావాన్ని బహిర్గతం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ చేసిన దారుణ దాడిని ఆయన ఖండించారు. ప్రశ్నలు చేస్తే దాడులు చేస్తారా? దౌర్జన్యాలకు దిగుతారా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

April 7, 2026 / 08:22 PM IST

ఆర్డీఎస్ఎస్ పనులు వంద శాతం పూర్తి చేయాలి: మంత్రి

ATP: జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పథకం పనులు వంద శాతం పూర్తి చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.

April 7, 2026 / 08:20 PM IST

హీట్ వేవ్స్‌పై అప్రమత్తం కావాలి: కలెక్టర్

TPT: వేసవి తీవ్రత దృష్ట్యా హీట్ వేవ్స్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వడదెబ్బ కేసులకు వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

April 7, 2026 / 08:20 PM IST

బాల్య వివాహాలకు నో చెప్పండి: ఎస్సై

CTR: కార్వేటినగరం ఎస్సై తేజస్విని ఐసీడీఎస్ సిబ్బందికి “బాల్య వివాహాలకు నో చెప్పండి” అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలపై ఉన్న చట్టపరమైన నిబంధనలు, వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు.

April 7, 2026 / 08:18 PM IST