• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘మానవత సంస్థ సేవలు ప్రశంసనీయం’

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ప్రతిభా జూనియర్ కళాశాలలో నిర్వహించిన మానవత సంస్థ నెలవారీ సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఒంటేరు రెడ్డన్న, అంకం శంకర్ రెడ్డి పాల్గొని సంస్థ సేవలను ప్రశంసించారు. నిస్వార్థ సేవలతో పాటు పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుకు మానవత సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

May 31, 2026 / 04:28 PM IST

‘కార్మిక హక్కుల కోసం పుట్టిందే ఎర్రజెండా’

NDL: డోన్ పట్టణంలో కార్మిక హక్కుల, సామాజిక న్యాయం, సమానత్వం కోసం పుట్టిందే ఎర్రజెండా అని సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్యం, శివరాం, నాగమద్దయ్య, రామాంజనేయులు, నక్కి శ్రీకాంత్ అన్నారు. కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

May 31, 2026 / 04:25 PM IST

‘200 EV బస్సులు తీసుకురావడంతో ప్రమాదాలను నివారిస్తాం’

VSP: కూర్మన్నపాలెం జంక్షన్లో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి గాయాలైన విషయం విధితమే. ఈ ప్రమాదం గురించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. 200 ఈవీ బస్సులను త్వరలో తీసుకువస్తున్నామని దీంతో ఓవర్‌లోడ్ తగ్గిస్తామన్నారు.

May 31, 2026 / 04:23 PM IST

టీడీపీలో కీలక బాధ్యతలు చేపట్టిన సూర్యనారాయణ

KDP: బద్వేలు నియోజకవర్గం టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాల బాధ్యతలను పార్టీ అధిష్టానం కడప జిల్లా డీసీసీ బ్యాంకు ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణరెడ్డికి అప్పగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొలవలి వేణుగోపాల్, టీడీపీ నాయకులు గోవిందాయపల్లె కిష్టయ్య, బద్వేల్ వెంకటసుబ్బయ్య ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

May 31, 2026 / 04:22 PM IST

రేపు కలెక్టరేట్‌లో అర్జీల స్వీకరణ: కలెక్టర్

KRNL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ డా.ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.

May 31, 2026 / 04:21 PM IST

‘విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం’

SKLM: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘డబుల్ ఇంజన్ సర్కార్’ కృషితోనే ఇది సాధ్యమైందని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చొరవతోనే జోన్ వచ్చిందన్నారు. దీనివల్ల రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

May 31, 2026 / 04:20 PM IST

ఐరాలలో గన్ పౌడర్ స్వాధీనం

CTR: ఐరాల మండలం గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో ఎస్సై జయశ్రీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గన్ పౌడర్‌తో పాటు పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

May 31, 2026 / 04:17 PM IST

ALERT.. తిరుపతి జిల్లాలో సెక్షన్-30 యాక్ట్ అమలు

TPT: తిరుపతి జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 30 వరకు పోలీస్ సెక్షన్-30 యాక్ట్‌ను విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుమల, తిరుపతి ప్రాంతాలకు భక్తులు భారీగా వస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాలంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు లేదా సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు.

May 31, 2026 / 04:10 PM IST

రేపు ఫించన్ల పంపిణీకీ సర్వం సిద్దం: MPDO

VZM: వంగర మండలంలో జూన్‌ నెలకు సంబంధించి NTR భరోసా ఫించన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు MPDO టి.రాజారావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..19 గ్రామ సచివాలయాలలో 142 మంది సిబ్బందితో 6240 పింఛన్‌లకు రూ.2,65,86,500 కోట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ మేరకు శతశాతం పింఛన్‌ పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.

May 31, 2026 / 04:06 PM IST

రెండు ఆర్వోబీల నిర్మాణానికి రూ.84 కోట్లు

PLD: పెదకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద (LC-27), సత్తెనపల్లి-రెడ్డిగూడెం మధ్య (LC-40) రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల(ROB) నిర్మాణానికి రూ.84 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుత రైల్వే గేట్ల స్థానంలో కొత్తగా టూ-లేన్ వంతెనలు నిర్మిస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణికుల నిరీక్షణకు చెక్ పడనుంది. రైల్వే అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు.

May 31, 2026 / 04:06 PM IST

యువత ‘మన్ కీ బాత్’ తప్పక చూడాలి: తేజేశ్వరరావు

SKLM: పీఎం మోదీ నిర్వహించే మన్ కీ బాత్ శ్రీకాకుళంలోని విద్యార్థులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ తేజేశ్వరరావు ఆదివారం వీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో నెలవారీగా జరుగుతున్న ముఖ్యమైన అంశాలను ప్రధాని ప్రజలతో పంచుకుంటారని తెలిపారు. యువత తప్పనిసరిగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు.

May 31, 2026 / 04:05 PM IST

జూన్ 1వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో జూన్ 1న సోమవారం 10:30 గంటలకు నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ ఆదివారం అన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలని కోరారు. తద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

May 31, 2026 / 04:04 PM IST

ఏనుగుల తరలింపుకు చర్యలు చేపట్టాలి: సీపీఎం

PPM: జిల్లాలో రైతులకు నష్టం కలిగిస్తున్న అడవి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కొమరాడలో ఇవాళ సీపీఎం మండల కన్వీనర్ సాంబమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనుగుల సంచారంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుంకీ ఏనుగుల సహాయంతో అడవి ఏనుగుల గుంపును ఇతర ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

May 31, 2026 / 04:01 PM IST

‘కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తాం’

ATP: తాడిపత్రి పట్టణంలో కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న కాలువలలో వ్యాపారస్తులు చెత్తాచెదారం వేయడం వల్లే కాలువలు బూడిపోతున్నాయని ఆయన అన్నారు. వర్షం వచ్చినప్పుడు వరద నీరు రోడ్లపై పారి ఇళ్లలోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

May 31, 2026 / 04:00 PM IST

రూ.50 లక్షలతో సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన

E.G: నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెంలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఫెన్సింగ్, బెంచీలు, పచ్చదనం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, వినోదం కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు.

May 31, 2026 / 04:00 PM IST