• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘లోకేష్ వద్దకు ప్రజల వినతులు వెల్లువ’

VSP: విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మంగళవారం జరిగిన సమావేశానికి ముందు వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుని సుమారు 60 వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు.

April 28, 2026 / 10:09 AM IST

ఎమ్మెల్యే ఆదేశాలు.. నీటి సమస్య పరిష్కారం

CTR: నగరి నియోజకవర్గం పరిధిలోని కాకవేడు AAW ప్రాంతంలో తాగునీటి సమస్య నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

April 28, 2026 / 10:08 AM IST

రోడ్డుపై పార్కింగ్‌ చేసిన వాహనాలు తొలగింపు

కడపలో ట్రాఫిక్ సీఐ తులసి రామ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సీఎస్‌ఐ చర్చి, నాగరాజుపేట ప్రాంతాల్లో రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను తొలగించారు. మహిళా డిగ్రీ కళాశాల వద్ద దీర్ఘకాలంగా నిలిపిన కార్లను క్లియర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలకు సూచించారు.

April 28, 2026 / 09:58 AM IST

గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గొల్లపల్లిలో ఉన్న ఆలయం, బైపాస్ రోడ్డులో ఉన్న ఆలయం వద్ద తెల్లవారుజామున నుంచి పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారిని ఎమ్మెల్యే బేబినాయన దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణి చేశారు.

April 28, 2026 / 09:45 AM IST

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన దివ్యాంగుడు

SKLM: మెలియాపుట్టి మండలం చాపర ZPHS 9వ తరగతి విద్యార్థి జ్ఞానసాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను అధిరోహించి సత్తాచాటాడు. హీరాపురానికి చెందిన అతను దివ్యాంగుడు. అయిన కుంగిపోకుండా అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో నిర్వహించిన శిక్షణలో ప్రతిభ కనబరచి క్రీడల్లో సత్తాచాటాడు. విద్యార్థి లక్ష్యం ముందు దివ్యాంగత్వం ఓడిపోయిందని పలువురు తెలిపారు.

April 28, 2026 / 09:43 AM IST

మంచానికే పరిమితం అయ్యా.. ఆదుకోండి.!

CTR: నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి PGRS కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కార్వేటినగరం (M) గొల్లకండ్రికకు చెందిన తనుజ కలెక్టర్‌ను బంధువులతో కలిసి కలిశారు. 90% అంగవైకల్యంతో తాను మంచానికే పరిమితమయ్యానని, ఫించన్ రూ.6 వేలు వైద్యానికే సరిపోతుందన్నారు. తన దీన స్థితిని గుర్తించి వికలాంగ పెన్షన్ పెంచాలని అభ్యర్థించారు.

April 28, 2026 / 09:34 AM IST

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: కైకలూరులో గత రాత్రి జరిగిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఛైర్మన్‌గా ప్రమాణం చేసిన పెన్మెత్స త్రినాధరాజుకు అభినందనలు తెలిపారు. రైతులకు మార్కెట్ యార్డ్ ద్వారా మరింత మెరుగైన సదుపాయాలు అందేలా కృషి చేయాలని, వ్యవసాయ రంగం అభివృద్ధికి ఛైర్మన్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

April 28, 2026 / 09:29 AM IST

30న మండల సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: ములకలచెరువు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో రమణ ప్రకాష్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. మండల అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.

April 28, 2026 / 09:25 AM IST

లరీ, ఆటో ఢీ.. పలువురికి గాయాలు

BPT: సంతమాగులూరు మండల పరిధిలోని కొమ్మాలపాడు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ ఆటోను బలంగా ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, స్థానిక పోలీసులు గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 28, 2026 / 09:23 AM IST

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

KRNL: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు కర్నూలు ఆర్ఐవో లాలప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫెయిలైన విద్యార్థులు, ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ఫీజును ప్రకటించిన తేదీల్లోనే చెల్లించాలని తెలిపారు.

April 28, 2026 / 09:13 AM IST

వీకోటలో ఓ పత్రిక విలేఖరి దారుణ హత్య

CTR: వీకోట పట్టణంలో ఓ పత్రిక విలేఖరి జగన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

April 28, 2026 / 09:13 AM IST

ఇంధన కొరత లేదు.. పరిమితి మేరకే సరఫరా: కలెక్టర్

పల్నాడులో పలు పెట్రోల్ బంకుల్లో కలెక్టర్ కృతిక శుక్ల సోమవారం రాత్రి 10 గంటలకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. జిల్లాలో ఇంధన కొరత లేదని, అన్ని బంకుల్లో సరఫరా పునరుద్ధరించామని అన్నారు. వాహనదారుల సౌకర్యార్థం బైకులకు రూ.200, ఆటోలకు రూ.300, కార్లకు రూ.1000 చొప్పున పరిమితి విధించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కూపన్లు అందజేస్తున్నామన్నారు.

April 28, 2026 / 09:11 AM IST

ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారు దేవరోత్సవం

VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం స్థానిక హుకుంపేటలో సోమవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఘటాలను దర్శించుకుని పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం చిత్ర, విచిత్ర వేషధారణలతో అంగరంగ వైభవంగా ఘటాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అర్ధరాత్రి తర్వాత మూడు లాంతర్ల వద్దనున్న చదరుగుడిలో ప్రతిష్టించారు.

April 28, 2026 / 09:07 AM IST

బొమ్మనహాల్ మండలంలో 13.2 మి.మీ వర్షపాతం నమోదు

ATP: జిల్లాలో గత 24 గంటల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా రెండు మండలాల్లో వర్షం కురిసింది. బొమ్మనహాల్ మండలంలో గరిష్ఠంగా 13.2 మి.మీ, డీ హీరేహాల్ మండలంలో 9.8 మి.మీ వర్షపాతం రికార్డయ్యింది. జిల్లా మొత్తం 23 మి.మీ వర్షం కురవగా, సగటున 0.7 మి.మీగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

April 28, 2026 / 09:06 AM IST

రూ.కోటితో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

నెల్లూరు: కావలి పట్టణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి పర్యటించారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు రైల్వే అండర్ పాస్‌ను పరిశీలించారు. ఉదయగిరి రోడ్డు నుంచి ఐడీఎస్ఎంటీ లేఅవుట్ వరకు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. దీంతో వెంగళరావు నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

April 28, 2026 / 09:06 AM IST