VZM: కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో-బేటీ పడావో’ పథకంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ అనర్థాలపై అధికారులు వివరించారు. అలాగే పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా నివారణపై చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవడం, అతివేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై నిఘా ఉంచారు.
CTR: పుంగనూరులోని అంబేద్కర్ ప్రగతి భవనంలో మంగళవారం నేషనల్ మజ్దూర్ యూనిట్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రచార కార్యదర్శి దయ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం భవిష్యత్తులో యూనియన్ తరపున చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించారు. RTC ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తునట్లు తెలిపారు.
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని మంగళవారం విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
కర్నూలు: జిల్లా ఉపాధి కార్యాలయం నిర్వహించిన మినీ జాబ్ మేళాలో 87 మంది నిరుద్యోగులు ఇవాళ పాల్గొన్నారు. వివిధ సంస్థల ఇంటర్వ్యూలలో 54 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
VZM: జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్‌ని వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం వెల్లడించారు. ముఖ్యంగా ఈవ్ టీజింగ్, కోడిపందేలు, పేకాట, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
KKD: జిల్లాలోని 14 మండలాల్లో రానున్న 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు వేసవి ఎండలు, వడగాడ్పుల నుంచి రక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎం. ఎన్. హరేంద్ర ప్రసాద్ ప్రజలను కోరారు. 41 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
GNTR: నవులూరులో రహదారి కబ్జాకు గురైంది. ఉడా కాలనీలోని అక్సా మసీదు ఎదుట రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. ఏకంగా మసీదు గేటుకు అడ్డుగా ఈ నిర్మాణం చేపట్టారు. దీంతో నమాజ్ కోసం మసీదుకు వెళ్లే ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారికి అడ్డుగా ఉన్న ఆ ప్రహరీ గోడను తొలగించాలని వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కడప: జిల్లా MLA మాధవిరెడ్డికి రివర్స్‌లో షాక్ తగిలింది అని వైసీపీ ట్వీట్ చేసింది. దీనికి MLA స్పందిస్తూ.. ప్రజల కోసం చేస్తున్న పనులను వక్రీకరించి, తప్పుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కడపలో స్వచ్ఛత, పాఠశాలల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానన్నారు. విమర్శలు, దుష్ప్రచారాలు తమ సేవలను ఆపలేవని స్పష్టం చేశారు.
PLD: సత్తెనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇందులో పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఇళ్లు, పెన్షన్, వైద్య సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలా కాకుండా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తామని అన్నారు.
BPT: వేమూరు నియోజకవర్గంలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భట్టిప్రోలు-సురేపల్లి వద్ద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రైతుల సభ జరగనుంది. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంగళవారం పరిశీలించారు. వేదిక, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
E.G: రాజమండ్రి నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. మంగళవారం పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి విధిగా రిజిస్టర్ మెయింటెయిన్ చేస్తూ రోజువారీ కార్యకలాపాలను నమోదు చేయాలని సూచించారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానళ్లను మంత్రి సవిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా విద్యుత్ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుపతి సందేశ్ 2.0 కార్యక్రమంలో జూమ్ మీటింగ్ సందర్భంగా “YS Jagan Mohan” పేరుతో కనిపించిన లాగిన్ అధికారికం కాదని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ఐజీపీ ఆకే.రవికృష్ణ అధికారిక జూమ్ ఐడీ వేరుగా ఉందని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
NDL: లోకక్షేమం కోసం శ్రీశైలం భ్రమరాంబ దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పసుపు, కుంకుమ సమర్పణను ‘శాంతి ప్రక్రియగా పిలుస్తారని ఈవో శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. తొలి విడతలో 20 వేల గుమ్మడికాయలు, 5 వేల కొబ్బరికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలను సమర్పించినట్లు ఈవో వెల్లడించారు.