• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో పోలీసు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ

W.G: మైసూరు దత్త పీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆకివీడు దత్తక్షేత్రంలో శుక్రవారం హెల్మెట్ల పంపిణీ చేపట్టారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ఆకివీడు సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులకు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కాళీచరణ్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.

May 30, 2026 / 06:57 AM IST

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి: మందకృష్ణ

E.G: దళిత క్రైస్తవుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ గడువును మరో 6నెలలు పెంచాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో వెనుకబడిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు.

May 30, 2026 / 06:48 AM IST

జిల్లాకు ఐదు రోజుల వర్ష సూచన..!

కర్నూలు ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నేటి నుంచి జూన్ 3 వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. రైతు సోదరులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

May 30, 2026 / 06:44 AM IST

మహిళా సాధికారతకు టీడీపీనే కేరాఫ్: ఎమ్మెల్యే

GNTR:మహిళా సాధికారతలో ఎప్పుడూ టీడీపీదే ముందంజ అని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి అన్నారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని లోకేశ్ ప్రకటించడంతో శుక్రవారం శ్రీనివాసరావుపేటలోని ఆమె కార్యాలయంలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లని, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

May 30, 2026 / 06:36 AM IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఇంఛార్జ్

అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.

May 30, 2026 / 06:35 AM IST

169.16 హెక్టర్లలో పంటలకు నష్టం

NLR జిల్లాలో ఇటీవల భారీ గాలులు వీస్తుండడంతో మామిడి, అరటి, నిమ్మ, ఆరంజ్, తమలపాకుల తోటలు 169.16 హెక్టర్లల్లో దెబ్బతిన్నాయి. 118 మంది రైతులు నష్ట పోయారు. దీంతో అధికారులు పంట నష్ట వివరాల ప్రాథమిక అంచనాలు రూపొందించి GOVTకు నివేదికలు పంపినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు.

May 30, 2026 / 06:33 AM IST

కాకినాడ డీఎంఈగా డాక్టర్ విష్ణువర్ధన్ బాధ్యతలు

KKD: రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా డాక్టర్ ఏ. విష్ణువర్ధన్ శుక్రవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం పదోన్నతిపై డీఎంఈగా నియమించింది. పలువురు వైద్యులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన వైద్య విద్యారంగంలో సేవలు మరింత మెరుగుపరుస్తారన్నారు.

May 30, 2026 / 06:32 AM IST

రానున్న రోజుల్లో జిల్లాకు మోస్తరు వర్షాలు

ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 37.2 నుంచి 37.5 డిగ్రీలుగా నమోదు కానున్నాయి.

May 30, 2026 / 06:32 AM IST

విద్యుత్ షాక్‌తో మూడు గొర్రెల మృతి

ASR: హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గంగరాజుపుట్టు గ్రామంలో విద్యుత్ లైన్ ఎర్త్ కావడంతో మూడు గొర్రెలు షాక్‌కు గురై మృతి చెందాయి. మృతిచెందిన గొర్రెలు జన్ని రమేష్‌కు చెందినవిగా స్థానికులు తెలిపారు. గ్రామంలోని విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని, మరమ్మతులు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించలేదని గ్రామస్థులు ఆరోపించారు.

May 30, 2026 / 06:22 AM IST

బిదనంచెర్లలో 110 ఏళ్ల తర్వాత మంగమ్మ దేవర

KDP: సింహాద్రిపురం(M) బిదినంచర్ల గ్రామంలో 110 ఏళ్ల తర్వాత శ్రీయేనే మీద గంగమ్మ తల్లి దేవరను నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దేవర కార్యక్రమం నేటి నుంచి రెండు రోజులపాటు జరుగుతుంది. శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం దేవర కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

May 30, 2026 / 06:21 AM IST

నడింపల్లిలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి

BPT: చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో సాగుతున్న కోడిపందేల స్థావరంపై పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేశారు. ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో పందేలు కాస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,250 నగదుతో పాటు రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు.

May 30, 2026 / 06:20 AM IST

మహిళా రిజర్వేషన్లకు కృతజ్ఞతలు తెలిపిన మహిళలు

విశాఖ: మహిళా రిజర్వేషన్ల అమలు నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో మహిళలు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ.. మహిళా సాధికారతను ఆచరణలో చూపించిన పార్టీ టీడీపీ పార్టీయేనన్నారు. మహిళల భద్రత, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

May 30, 2026 / 06:19 AM IST

పత్తి కొనుగోళ్లలో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ

PLD: నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు శుక్రవారం కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసి పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ‘కపాస్ కిసాన్ యాప్’ వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్లాట్ బుకింగ్, సాంకేతిక సమస్యలను పరిష్కరించి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

May 30, 2026 / 06:11 AM IST

నేడు నెల్లూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: నెల్లూరులోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ల మరమ్మత్తులు కారణంగా మూడో మైలు, డి ఎస్ నగర్, ప్రశాంతి నగర్, రాజీవ్ గాంధీ కాలనీ, కిసాన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

May 30, 2026 / 06:09 AM IST

మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

SKLM: మహిళలు, బాలికల భద్రతకు జీరో టోలరెన్స్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. DGP ఆదేశాల మేరకు జిల్లాలో ఆపరేషన్ దండయాన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.మహిళల పై నేరాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జిల్లాలో శక్తి బృందాల పెట్రోలింగ్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు

May 30, 2026 / 06:09 AM IST