CTR: జిల్లాలో చేపట్టిన జనగణనలో భాగంగా గృహాల సర్వే 102 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 5.92 లక్షల ఇళ్ల సర్వే లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 6.08 లక్షల గృహాలను సర్వే చేశారు. మొత్తం జనాభా 18.91 లక్షలు ఉండగా.. 17.13 లక్షల మంది గణన పూర్తి చేశారు. చిత్తూరు రూరల్ మండలం 113 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది.
ELR: ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులను అరెస్టు చేశామని సీఐ రామకృష్ణ శుక్రవారం తెలిపారు. సమాచారం మేరకు.. తంగేళ్లమూడి బీడీ కాలనీ నోవా కాలేజీ వద్ద గంజాయి సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాకినాడ జిల్లా తలుపులమ్మలోవ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు సమాచారం.
GNTR: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్‌ను సోమవారం కల్లా ప్రతి బీఎల్‌వో 70 శాతం పూర్తి చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. శుక్రవారం కౌన్సిల్ హాలులో బీఎల్వోలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.
PLD: నరసరావుపేట పెద్ద చెరువు కలెక్టర్ బంగ్లా వద్ద స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ భారత్ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పాల్గొన్నారు.పెద్ద చెరువు పరిసరాల్లో శుభ్రత చర్యలు చేపట్టి, కాలువల్లో పేరుకు పోయిన పూడిక తొలగించారు.
గుంటూరు: జీజీహెచ్‌లో ఓ వ్యక్తి వార్డు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్(50). కిడ్నీ సమస్యతో ఈ నెల 23న ఆయన ఆసుపత్రిలో చేరాడు. కాలకృత్యాలకు వెళ్లి కిటికీలోంచి కిందకు దూకాడు. శ్రీనివాస్ వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ. ఆయన భార్య మృతి చెందగా, ఇద్దరు కుమారులున్నారు.
E.G: గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిల్లులు పూర్తిగా ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు. రెండు కుటుంబాల సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
విశాఖలోని వీఎంఆర్‌డీఎ అదనపు కమిషనర్‌గా దాట్ల కీర్తి శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కీర్తిని వీఎంఆర్‌డీఎ అదనపు కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె శుక్రవారం మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన తదుపరి బాధ్యతలు చేపట్టారు. కీర్తి గతంలో వీఎంఆర్‌డీఎ కార్యదర్శిగా పని చేశారు.
PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “100 రోజులు-100 గ్రామాలు” పర్యటన 91వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి అమరావతి మండలం ధరణికోటలో పర్యటించిన ఆయన.. రూ.1.05 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు పాఠశాల గదులు, సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
NTR: ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారినంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ అధికారిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి చెందిన జయకృష్ణ పలువురు అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: ఎమ్మెల్యే మాలకొండయ్య నేడు చీరాలలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు 31వ వార్డు జయంతి పేటలో రూ.19 లక్షలతో నిర్మించనున్న అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. 9:30గంటలకు దండు బాట నుంచి జయంతి పేట వరకు రూ.70 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సి.సి. డ్రైన్ శంకుస్థాపనలో పాల్గొంటారు.10గంటలకు 31వ వార్డు జయంతి పేటలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర’లో పాాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
GNTR: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 3న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పి.వి.ఎస్ లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించే ప్రాంగణాన్ని సందర్శించిన అధికారులు, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
అల్లూరి: జనాభా గణన-2027లో భాగంగా జరుగుతున్న మొదటి దశ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. “ఇళ్ల జాబితా, ఇళ్ల గణన” ప్రక్రియ జూన్ నెలతో ముగుస్తుందన్నారు. దీనికి సంబంధించిన ఎన్యుమరేటర్ల క్షేత్ర పర్యటన నేటితో ముగుస్తుందన్నారు. ఇప్పటి వరకు తమ ఇంటి వివరాలు నమోదు చేయించుకోని వారు ఇవాళ్టిలోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.
CTR: వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె పంచాయతీ అభివృద్ధి అధికారి బాలసుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. బొమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఉపాధి హామీ పథకంలో రూ.2.75 లక్షలు డ్రా చేసి లబ్దిదారులకు ఇవ్వకుండా దుర్వినియోగం చేయడంతో సస్పెండ్ చేశారు.
SKLM: ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేసినప్పుడు గుర్తింపు తప్పదని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. జిల్లా గణంకాల అధికారి H.నాగ భూషణ్ పదవి విరమణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన MLA రవికుమార్ పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు మంచి సేవలు అందిస్తే ఆ వ్యక్తిని సమాజం ఎప్పుడు గుర్తిస్తుందని తెలిపారు.
KRNL: కర్నూలు నగరంలో చేపడుతున్న పూడికతీత పనులను నాణ్యంగా, గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. ఏ.క్యాంపు, బి.క్యాంపు, గణేష్‌నగర్ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం డ్రైన్లు, పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. డ్రైన్ల కింది భాగం వరకు పూడికలు తొలగించకపోతే బిల్లులు మంజూరు చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు.