NTR: విజయవాడ బెరమ్ పార్క్‌లో ఏపీటీడీసీ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ పద్మావతి, ఈడీ మేక శేషగిరి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ELR: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతోందని డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ అన్నారు. నిడమర్రులో శుక్రవారం మన పాఠశాల-మన అందరి బాధ్యత ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో ఆమె పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన నలుగురు విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని వసతులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
NDL: జిల్లాలో మహిళల భద్రత కోసం ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమం ప్రారంభించినట్లు శుక్రవారం ఎస్పీ సునీల్ తెలిపారు. నేరస్థులకు త్వరితగతిన శిక్షలు, 60 రోజుల్లో ఛార్జిషీట్ల దాఖలు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు దీనిలో భాగమని వెల్లడించారు. మహిళలపై నేరాలకు జీరో టాలెరెన్స్ పాలసీ తీసుకొస్తామని, స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్‌తో పర్యవేక్షిస్తామన్నారు.
SS: ఈనెల 31న హిందూపురం ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా ఫుట్‌బాల్ సబ్‌జూనియర్ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జేవీ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తమ అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు. ఇతర పూర్తి వివరాల కోసం క్రీడాకారులు 8099598958 నంబరును సంప్రదించాలని కోరారు.
PPM: జిల్లాలోని పార్వతీపురం మండలం మడకవాని వలస గ్రామానికి చెందిన శ్మాశాన వాటిక ఆక్రమణపై అధికారులు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి బత్తిన మోహన రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఫిర్యాదు దస్త్రాన్ని ప్రదర్శించారు. మరుభూమి విస్తీర్ణం ఏటా తగ్గుతోందని, అటు వైపు వెళ్లే రహదారిని కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
PLD: మహిళలు, చిన్నారులపై నేరాల అదుపునకు జిల్లాలో ‘ఆపరేషన్ దండయాన’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా వేలాది అవగాహన సదస్సులు నిర్వహించామని, గల్లంతైన 190 మంది బాలికలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. పాత నేరస్థులపై నిఘా ఉంచామన్న ఎస్పీ.. ఆపదలో ఉన్నవారు 112, 181, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
కర్నూలు-దూపాడు రైలుమార్గంలో కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో ఇవాళ ఒక గుర్తుతెలియని వ్యక్తి వందేభారత్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో మృతదేహం తీవ్రంగా ఛిద్రమై గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని, తెలుపు గీతల షర్టు, నీలం రంగు లోయర్, తెలుపు కట్ బనియన్, నలుపు కట్ డ్రాయర్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ATP: గుంతకల్లు డివిజన్ పరిధిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంతకల్లు-బోధన్ రైలు ఈ నెల 30, 31 తేదీల్లో రద్దయింది. అలాగే గుంతకల్లు-మార్కాపురం రైలును ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిలిపివేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని కోరారు.
విజయనగరం: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కాన్ కేంద్రాలు నడుపుతున్న వారు స్కాన్ చేసిన ప్రతి కేసును ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నెలలో స్కాన్ చేయని నిల్ రిపోర్టును డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపాలని అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై సమీక్షించారు.
కోనసీమ: అప్పనపల్లి-పాసర్లపూడి గ్రామాల మధ్య పాటురేవుపై రూ.5 కోట్ల సీఆర్ఎఎఫ్ నిధులతో అధునాతన వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దశాబ్దాల నాటి పాత కాజ్వే పూర్తిగా శిథిలం కావడంతో దాన్ని తొలగించి, 60 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో కొత్త వంతెనను నిర్మిస్తున్నారు. గోదావరి వరదల సమయంలో లంక గ్రామాల ప్రజలకు ముంపు సమస్యలు తలెత్తకుండా ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడనుంది.
అన్నమయ్య: నిమ్మనపల్లె మండలం మర్రిబండ వద్ద శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాల కారణంగా ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు.
BPT: వేమూరు నియోజకవర్గ వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు గోపాలం రాము అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవారం ఆయన అంత్యక్రియల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు. రాము పాడె మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండే అశోక్ బాబు, సీనియర్ నేత మరణాన్ని జీర్ణించుకోలేకపోయారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
ప్రకాశం: టంగుటూరు(M) ఎర్రజర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు కమలమ్మ మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. మతిస్థిమితం లేని కమలమ్మ ఈ నెల 27వ తేదీన ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వృద్ధురాలిని వెతికే క్రమంలో ఆమె మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు.
అనకాపల్లి: గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం రాత్రి పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామంలో వందరోజుల యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలో పోలీస్ స్టేషన్‌కు తెలియ చేయాలన్నారు.
NDL: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి రాంగ్రూట్లో వెళ్లడంతో మల్యాలకు చెందిన గొర్ల సుంకన్న మృతి చెందినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు ఆరోపించారు. శుక్రవారం మాల్యాలో సుంకన్న పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో గాయపడిన సుంకన్న కర్నూలు GGHలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.