KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద పెండేకల్ నుంచి ఎమ్మిగనూరు వైపు మొక్కజొన్న లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొక్కజొన్న సంచులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
ELR: కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు A- గ్రేడ్ లభించిందని ఇంఛార్జి ప్రిన్సిపాల్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 సంబంధించి కళాశాలలో సౌకర్యాలను అన్ని విభాగాల రికార్డులను అకడమిక్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. నారాయణపురం డిగ్రీ కళాశాలకు చెందిన తెలుగు అధ్యాపకులు కొండా రవి, తణుకు డిగ్రీ కళాశాలకు చెందిన జువాలజీ అధ్యాపకులు చెప్పారు.
కోనసీమ: అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి డైరెక్టర్‌గా మండపేట మండలం ద్వారపూడికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు యరగతపు బాబ్జి నియమితులయ్యారు. ఆయన టీడీపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
NTR: ఏపీ CRDA కమిషనర్ విజయ రామరాజును జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాజగోపాల్ (తాతయ్య) మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా CRDA పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జగ్గయ్యపేట పరిధిలోని బలుసుపాడు రోడ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, కమిషనర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
CTR: పుంగనూరు కోర్ట్ సముదాయంలో రెండవ అదనపు సివిల్‌జడ్జి, జూడిషియల్ మెజిస్ట్రేట్‌ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 3 కోర్టులతో కలిపి పట్టణంలో 4 కోర్టుల్లోను కేసులు పరిష్కరించనున్నారు. కేసులను వేగంవంతంగా పరిష్కరించేందుకు అదనపు కోర్టు మంజూరు కావడంపై న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్ హర్షం వ్యక్తపరిచారు.
W.G: ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పెంటపాడుకు చెందిన జనసేన నాయకురాలు కసిరెడ్డి మధులత నియమితులయ్యారు. స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలగడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన నియమాకానికి సహకరించిన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, మద్దిపాటి వెంకట్రాజులకు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు.
KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర బండి కనుమ పంప్ హౌస్, స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ పనితీరును అధికారులతో సమీక్షిస్తూ.. నీటి నాణ్యతపై ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. నగర ప్రజలకు శుద్ధమైన మరియు సమృద్ధిగా తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
CTR: ఇవాళ చిత్తూరులో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిలు, శక్తి బృందాలతో కలిసి వివిధ ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు భద్రత, రక్షణ, చట్టపరమైన భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలలో తక్షణ సహాయం, అత్యవసర మద్దతు కోసం శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించమని మహిళలను ప్రోత్సహించారు.
కృష్ణా: మతోన్మాద ట్రంప్ చర్యలను ఖండిస్తూ, క్యూబాకు అండగా నిలబడాలని గుడివాడలో సీపీఎం నేతలు మంగళవారం పిలుపునిచ్చారు. సోషలిస్ట్ దేశమైన అయినా క్యూబాపై గతి అనేక సంవత్సరాలుగా అమెరికా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ, ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆర్.సీపీ రెడ్డి అన్నారు. క్యూబాకు మనమంతా స్వచ్ఛందంగా ఆర్థిక సాయం అందించాలని తెలిపారు.
ప్రకాశం: పెద్దచెర్లోపల్లి (M) తుర్కపల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మార్కాపురం మైనింగ్ అధికారులు దాడి చేసి నిల్వ ఉంచిన తెల్ల రాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకొని రెవిన్యూ అధికారులకు అప్పగించినట్లు సమాచారం.
GNTR: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తున్న1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇతర మతాల్లోని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నప్పుడు దళితులకే ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు. కుల వ్యవస్థ వల్లనే దేశంలో అసమానతలు పెరిగాయని, దీనికి కారణమైన శక్తులపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
PLD: శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిలకు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం వారికి వేద ఆశీర్వచనాలు అందించి సత్కరించారు.
KKD: గొల్లప్రోలు మండలం అక్రమంగా తరలిస్తున్న 1,200 కేజీల రేషన్(PDS) బియ్యాన్ని మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కె.నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2,55,800 ఉంటుందని అధికారులు వెల్లడించారు.
W.G: తాడేపల్లిగూడెం వ్యాపారపరంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతమని కలెక్టర్ నాగరాణి కొనియాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని, గూగుల్ డేటా సెంటర్ స్థాపనే అందుకు నిదర్శనమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశ్రమల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ పాల్గొన్నారు.
KRNL: కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పర్యటించి అభివృద్ధి పనులను ఇవాళ పరిశీలించారు. ఎంపీ నిధులు, NREGS ద్వారా జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. గ్రామ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, కొత్త పశు వైద్యశాల నిర్మాణం చేపడతామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.