KDP: పెడ్లిమర్రి(M)లోని చిన్నదాసరపల్లెలో ప్రసిద్ధిచెందిన వేయినూతులకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పి. నరసింహ హరిప్రసాద్ తెలిపారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
BPT: జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సూచించారు. సోషల్ మీడియా ద్వారా పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KRNL: కోసిగి ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 28న ఎంపీపీ ఈరన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్. మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 16 రకాల అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మండలంలోని అన్నీ శాఖల అధికారుల ప్రగతి నివేదికలను ఇవాళ సాయంత్రంలోగా ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
అన్నమయ్య: రాయచోటికి చెందిన బౌలర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో కాకినాడ కింగ్స్ జట్టుకు రూ.4 లక్షలకు ఎంపికయ్యారు. టీ20ల్లో 23 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీసిన ఆయన, గతంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఎంపికయ్యారు. అలాగే లిస్ట్-Aలో 15 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు సాధించారు. ఈ అవకాశంతో ఆయన కెరీర్‌కు మరో మెట్టు ఎక్కినట్లైంది.
NDL: జుపాడుబంగ్లా మండలంలోని పోతులపాడు గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి చెందిన మేక ఒకే ఈతలో 4 పిల్లలకు జన్మ నిచ్చింది. గతేడాది కూడా ఇదే మేక మూడుపిల్లలకు జన్మనిచ్చింది. గత ఐదురోజుల కిందట నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన తెలి పారు. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన మేకను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురైతున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నంద్యాలకు చెందిన ఉమాదేవి తన భక్తిని చాటుకుంది. సోమవారం సాయంత్రం ఆలయం వద్దకు శ్రీవారి పాదాలను ప్రతిరూపంగా సుమారు 1500 గ్రాముల పసుపుతో తయారు చేసి పూలతో అందంగా అలంకరించి తీర్చిదిద్దింది. ఆలయ పరిసరాల్లో ఈ అపూర్వ దృశ్యం భక్తులను ఆకట్టుకుని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా మార్చింది.
GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరులోని పెట్రోల్ బంకులను కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన సరఫరా సమృద్ధిగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ప్రకాశం: జిల్లాలో ఇంధన సరఫరా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం కలెక్టర్ రాజాబాబు ఫ్యూయల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇంధన కొరత, అధిక ధరలు, నాణ్యత సమస్యలపై ప్రజలు 1077 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు పనిచేస్తుందని, ఇంధన సమస్యలపై మాత్రమే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో గత రాత్రి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మినీ బస్టాండ్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బస్సు షెల్టర్ ప్రారంభించిన అనంతరం సామాన్యుడిలా టికెట్ తీసుకుని ధర్మాజీగూడెం నుంచి ఏలూరు రోడ్ వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తూ.. ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించారు.
కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు అంబాజీపేట మండలం చిరుతపూడి సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు పి.గన్నవరం మండలం మానేపల్లి వద్ద 1.48 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు అని తెలిపారు.
కడప జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 197 మందిపై కేసులను నమోదు చేయడం జరిగిందని, రూ. 50,175 జరిమానా విధించామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
NDL: కోవెలకుంట్లలో వెలసిన పురాతన ప్రసిద్ధ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. 27న పేట తిరునాళ్ల, 28న కోనేటి తిరునాళ్ళ, 29న రథోత్సవం, కళ్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు.
తూ.గో: రాజమండ్రి 45వ డివిజన్ R&B వాంబే గృహాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన LTP అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అభివృద్ధికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
KRNL: అనంతపురం హనీ ట్రాప్ కేసులో కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ కొరడా ఝళిపించారు. ఈ కేసులో నలుగురు పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. రాప్తాడు రూరల్ సీఐ శేఖర్‌ను కర్నూలు VRకు అటాచ్ చేయగా, సీఐ శ్రీహర్షతో పాటుగా HC గిరి, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి తొలగించారు. రూరల్ SI రాంబాబు, PCలు దేవేంద్ర, జయ నాయక్‌ను డీఐజీ సస్పెండ్ చేశారు.
కోనసీమ, కృష్ణ జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం రెండు జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. బంకుల్లో నిల్వలు, డిమాండ్ పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించిన మంత్రి, సరఫరాలో అంతరాయం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని బంకుల వద్ద క్రమబద్ధంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు