మార్కాపురం పట్టణంలోని పెట్రోల్ బంకులను కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాటిల్స్, క్యాన్లలో పెట్రోల్ విక్రయించవద్దని యజమానులను హెచ్చరించారు. సాధారణ విధానంలోనే ప్రజలకు ఇంధనం అందించాలని సూచించారు. పట్టణంలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేస్తూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టరాదన్నారు. ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు.
KDP: సిద్దవటం మండలం మాధవరం-1లోని శ్రీ భద్రావతి బావనారాయణ దేవస్దానంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి భద్రావతి భావనారాయణ స్వాముల వారికీ పానుపు సేవా కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం మహిళలు నిర్వహించిన కోలాట ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. గ్రామంలోని ప్రజలు కోలాట ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు.
TPT: నాగలాపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత తీవ్రంగా ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు. రోజుకు 150 మందికి పైగా ఓపీకి వస్తున్నప్పటికీ అవసరమైన మందులు అందడం లేదని తెలిపారు. సాధారణ జ్వరం, షుగర్, బీపీ రోగులకు కూడా ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. మందులు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
VSP: విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మంగళవారం జరిగిన సమావేశానికి ముందు వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుని సుమారు 60 వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు.
CTR: నగరి నియోజకవర్గం పరిధిలోని కాకవేడు AAW ప్రాంతంలో తాగునీటి సమస్య నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.
కడపలో ట్రాఫిక్ సీఐ తులసి రామ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సీఎస్ఐ చర్చి, నాగరాజుపేట ప్రాంతాల్లో రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను తొలగించారు. మహిళా డిగ్రీ కళాశాల వద్ద దీర్ఘకాలంగా నిలిపిన కార్లను క్లియర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలకు సూచించారు.
VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గొల్లపల్లిలో ఉన్న ఆలయం, బైపాస్ రోడ్డులో ఉన్న ఆలయం వద్ద తెల్లవారుజామున నుంచి పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారిని ఎమ్మెల్యే బేబినాయన దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణి చేశారు.
SKLM: మెలియాపుట్టి మండలం చాపర ZPHS 9వ తరగతి విద్యార్థి జ్ఞానసాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను అధిరోహించి సత్తాచాటాడు. హీరాపురానికి చెందిన అతను దివ్యాంగుడు. అయిన కుంగిపోకుండా అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో నిర్వహించిన శిక్షణలో ప్రతిభ కనబరచి క్రీడల్లో సత్తాచాటాడు. విద్యార్థి లక్ష్యం ముందు దివ్యాంగత్వం ఓడిపోయిందని పలువురు తెలిపారు.
CTR: నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి PGRS కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కార్వేటినగరం (M) గొల్లకండ్రికకు చెందిన తనుజ కలెక్టర్‌ను బంధువులతో కలిసి కలిశారు. 90% అంగవైకల్యంతో తాను మంచానికే పరిమితమయ్యానని, ఫించన్ రూ.6 వేలు వైద్యానికే సరిపోతుందన్నారు. తన దీన స్థితిని గుర్తించి వికలాంగ పెన్షన్ పెంచాలని అభ్యర్థించారు.
ELR: కైకలూరులో గత రాత్రి జరిగిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఛైర్మన్‌గా ప్రమాణం చేసిన పెన్మెత్స త్రినాధరాజుకు అభినందనలు తెలిపారు. రైతులకు మార్కెట్ యార్డ్ ద్వారా మరింత మెరుగైన సదుపాయాలు అందేలా కృషి చేయాలని, వ్యవసాయ రంగం అభివృద్ధికి ఛైర్మన్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
అన్నమయ్య: ములకలచెరువు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో రమణ ప్రకాష్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. మండల అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.
BPT: సంతమాగులూరు మండల పరిధిలోని కొమ్మాలపాడు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ ఆటోను బలంగా ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, స్థానిక పోలీసులు గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు కర్నూలు ఆర్ఐవో లాలప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫెయిలైన విద్యార్థులు, ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ఫీజును ప్రకటించిన తేదీల్లోనే చెల్లించాలని తెలిపారు.
CTR: వీకోట పట్టణంలో ఓ పత్రిక విలేఖరి జగన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
పల్నాడులో పలు పెట్రోల్ బంకుల్లో కలెక్టర్ కృతిక శుక్ల సోమవారం రాత్రి 10 గంటలకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. జిల్లాలో ఇంధన కొరత లేదని, అన్ని బంకుల్లో సరఫరా పునరుద్ధరించామని అన్నారు. వాహనదారుల సౌకర్యార్థం బైకులకు రూ.200, ఆటోలకు రూ.300, కార్లకు రూ.1000 చొప్పున పరిమితి విధించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కూపన్లు అందజేస్తున్నామన్నారు.