ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామారావు పదోన్నతి పొందారు. ఆయనను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(RI )గా పదోన్నతి కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడే రామారావుకు పదోన్నతి రావడంతో మండలంలోని నాయకులు, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.