VZM: ఎల్కోట మండలం కొట్యాడ తలారి గ్రామంలో గల హైస్కూల్ విద్యార్థులు తమ సేవా గుణం చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు విరాళాల రూపంలో సేకరించిన రూ.5 వేల చెక్కును సీఎం సహాయ నిధికి ఆదివారం ఎల్కోటలోని ఎమ్మెల్యే లలిత కుమారికి ఆమె స్వగృహంలో అందజేశారు. చిన్నతనం నుండి విద్యార్థులకు అలవడిన సేవా గుణం పై ఎమ్మెల్యే కొనియాడారు.