SKLM: విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు టీడీపీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ అనంతరం జిల్లాలోని పలు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం తీసుకెళ్లారు. నాగావళి నదికి రక్షణ గోడ నిర్మాణం పై ముఖ్యంగా చర్చించారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.