NLR: ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో రైతుల పండించిన సజ్జ పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని బండగానిపల్లి పంచాయతీ కృష్ణారెడ్డి పల్లిలో ఆందోళన చేపట్టారు. రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే సజ్జలు కొనుగోలు చేసి సరైన గిట్టుబాటు ధరను అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.