అన్నమయ్య: తీవ్ర సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంబేపల్లిలో జరిగిన ప్రజా వేదికలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు అందిస్తోందన్నారు. వందరోజుల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు.