కడప: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మను బుధవారం భక్తులు దర్శించారు. వేకువజామునే ఆలయ అర్చకులు అమ్మవారి మూల విగ్రహాన్ని ఫల పంచామృతాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకించారు. పసుపు, కాటుక, కుంకుమ, నిమ్మకాయ హారాలు, వివిధ పుష్పాలతో మారెమ్మను అలంకరించారు.