GNTR: చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు బుధవారం ఉదయం ఆకస్మికంగా పట్టణంలో పర్యటించారు. 2వ డివిజన్ పరిధిలోని శానిటేషన్ కార్యాలయానికి వెళ్లి పారిశుద్ధ్య సిబ్బంది హాజరుశాతాన్ని స్వయంగా పరిశీలించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చెయ్యొద్దని చెప్పారు. పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు.