ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలో వీధి దీపాలు సరిగా వెలగకపోవడం వల్ల మరియు వీధి కుక్కలు స్వైర విహారం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్య పరిష్కరించాలని బీజేపీ నాయకులు మున్సిపల్ మేనేజర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరాల శ్రీనివాసరెడ్డి, ముక్కు వెంకట్ రెడ్డి, మస్తానయ్య, చెన్నకేశవులు, హరిబాబు పాల్గొన్నారు.