NLR: వరికుంటపాడు మండలం జి. కొండారెడ్డి పల్లె గ్రామ సమీపంలోని గండిపాలెం జలాశయ ప్రధాన కాలువ వద్ద ఉన్న ఓ చెట్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలకూలింది. దీంతో కాలువ గట్టుపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ మార్గం గుండా గుడి నరవ శివాలయము, ఎస్సీ కాలనీకి రాకపోకలు సాగిస్తుంటారు. రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.