GNTR: గుంటూరులోని రేషన్ షాపును విజిలెన్స్ ఎస్పీ సూర్య శ్రావణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కన్నవారితోటలోని రేషన్ షాపును తనిఖీ చేసిన విజిలెన్స్ ఎస్పీ అక్కడ నిలువ చేసిన బియ్యం, కందిపప్పు, పంచదార తదితర వస్తువుల, షాపులో స్టాక్‌కు సంబంధించి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సీఐలు శివాజీ, చంద్రశేఖర్, ఎమ్మార్వో శివశంకర్ ఇతర సిబ్బంది ఉన్నారు.