KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేబ్రోలులోని తన నివాసం వద్ద సోమవారం నుండి జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టు పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9:30 గంటలు నుండి సాయంత్రం 5 వరకు ప్రజలు నుండి అర్జీలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియపరచాలని సూచించారు.