ప్రకాశం: రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కనిగిరిలోని అర్బన్ కాలనీలో సోమవారం రూ.3 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. రాష్ట్రంలో గృహ వినియోగదారులతో పాటు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.