VZM: జిల్లాలోని కార్పొరేషను, మున్సిపాల్టీల్లో సహేతుకరమైన కారణం లేకుండా అర్ధ రాత్రుళ్ళు బహిరంగంగా తిరిగిన వారిపై టౌన్ న్యూసెన్సు చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులకు ఎస్పీ వకుల్ జిందల్ మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది కార్పొరేషను, మున్సిపాల్టీలు మరియు నగర పంచాయతీ పరిధిల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.