NLR: చేజర్ల మండలం ఏటూరు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్ నందు విద్యార్థులు దీపావళి వేడుకలు నిర్వహించారు. రేపు స్కూల్ సెలవు కావడంతో ముందస్తుగా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో దీపాలు వెలిగించి కకరవత్తులు కాల్చి సంతోషంతో దీపావళి పండుగ నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో విద్యార్థులు ఎంతో కేరింతలతో ఆనందంగా పాల్గొన్నారు.