VZM: టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీలో జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు చోటు దక్కింది. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.