VZM: భోగాపురం మండలంలోని లింగాలవలస మరో ఆన్లైన్ యాప్ మోసం వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రభాకర్ వివరాలు మేరకు.. రూ.లక్షల్లో డిపాజిట్ చేస్తే ఎనిమిది రోజులకు 20 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపడంతో ఓ యువకుడు బంధువులతో కలిసి రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేశాడు. మరికొంత మంది యువత కూడా నగదు చెల్లించారు. ప్రస్తుతం యాప్ పనిచేయకపోవడంతో భోగాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.