ELR: జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో శనివారం భూసేకరణ పనులపై ఆమె తన విడిది కార్యాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. ద్వారకాతిరుమలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.