ALR: భూముల జీవ వైవిద్య రక్షణ చర్యలు చేపడితే రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వరంలో జీవ వైవిధ్యభరిత సుస్థిర వ్యవసాయ విధానాలు భూవనరుల యాజమాన్య పద్దతులపై శనివారం కలెక్టరేట్లో వర్కుషాపు నిర్వహించారు. భూమి క్షీణతకు సంబంధించిన సమస్యలు, సవాళ్లను అధిగమించాలన్నారు. సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు.