ATP: ఓ ప్రేమ జంట గురువారం జిల్లా పోలీసులను ఆశ్రయించింది. హిందూపురం ముదిరెడ్డిపల్లికి చెందిన కీర్తి,షేక్షావలి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి గురువారం ఉదయం పెళ్లి చేసుకున్నారు. అయితే తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని అదేరోజు సాయంత్రం ఎస్పీని ఆశ్రయించారు. కంప్లైంట్ హిందూపురం పోలీస్ స్టేషన్కు పంపినట్లు ఏఎస్పీ తెలిపారు.