KDP: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులకు తక్షణం స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను ఆదేశించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల విక్రాయలపై నిఘా ఉంచి దాడులు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా టపాసుల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.