PPM: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పాఠ్యాంశాలపై సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ విద్యార్ధులకు సూచించారు. ఆ దిశగా విద్యార్ధులను తీర్చిదిద్దడమే మైస్కూల్, మై ప్రైడ్ ఉద్దేశమని పేర్కొన్నారు. మైస్కూల్, మైప్రైడ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక డివిఎం పురపాలకోన్నత పాఠశాలను సందర్శించారు.