VSP: పర్యావరణహిత దీపావళిని జరుపుకోవాలని విశాఖ నగర పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. విశాఖలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలన్నారు. పశు, పక్షులు, వృద్ధులకు హాని కలగకుండా సాంప్రదాయ బద్దంగా దివ్వెలపండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.