శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. యూనివర్సిటీ అధికారులు ఇటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీగా ఈనెల 20న ప్రకటించగా ఆదివారం కావడంతో నేడు సోమవారంతో గడువు ముగుస్తుంది. ప్రాక్టికల్స్ ఈనెల 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరుగుతాయి.