ATP: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉపాధి హామీ పీడీ సలీం బాషా పేర్కొన్నారు. గురువారం రాయదుర్గం పట్టణ సమీపంలోని డ్వామా కార్యాలయంలో 5 మండలాల ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పనులను పూర్తి చేయాలన్నారు.