కడప: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకువచ్చిన నూతన ఇసుక విధానంపై ఒంటిమిట్ట మండలానికి చెందిన తెలుగు తమ్ముళ్లు శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సుంకేసుల బాషా మాట్లాడుతూ.. పేదవాడికి ఇసుక అందాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇసుకను అందిస్తున్నారని అన్నారు. గజ్జల నరసింహారెడ్డి, బొబ్బిలి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.