మన్యం: గరుడబిల్లి మండలం కొంకిడివరం గ్రామ సమీపంలో గురువారం ఎస్సై రమేష్ నాయుడు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడుల్లో నాటు సారా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 260 లీటర్ల నాటుసారా, ఓ ద్విచక్రవాహనం, ఓ బొలెరో వాహనం స్వాధీనం చేసుకొని పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.