కోనసీమ: రాజోలు APSRTC డిపోను రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ సోమవారం సందర్శించారు. డిపో మేనేజర్‌తో మాట్లాడి ప్రయాణికుల కోరిక మేరకు కొన్ని సర్వీసులను పెంచామని తెలియజేశారు. అలాగే బస్ డిపో అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.