VZM: గజపతినగరం బాలికల హైస్కూల్ కు చెందిన ముగ్గురు బాలికలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు దొరరాజు, శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఇటీవల నియోజకవర్గస్థాయి పోటీలలో ఎం ధనుశ్రీ, బి జాహ్నవి, జె.అంకితలు వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.