ప్రకాశం: కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో ఆదివారం ఉదయం కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా పేదలు వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని ఇది ఎంతో ప్రయోజనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ సహాయంతో కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్య సేవలు పొందే అవకాశం ఉందన్నారు.