ASR: డుంబ్రిగూడ మండలంలోని గోపులవలసలో టీఎన్టీయూసీ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం స్వామి, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్బారావు ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.