కృష్ణ: నాగాయలంక మండలం ఎదురుమొండిలో బుధవారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగాయలంక సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యులు రోగులకు పరీక్షలు చేసి బొండాడ గ్రూప్ ఛైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు సహకారంతో రూ. 30 వేలతో మందులు అందజేశారు. తహశీల్దార్ హరనాధ్, రాం బాలాజీ, శంకర్నాథ్, తదితరులు పాల్గొన్నారు.