W.G: విజయవాడ వరద బాధితులకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. శనివారం ఉండి మండలం హైస్కూలు, ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయులు సేకరించిన రూ.1,12,200 విరాళాన్ని భీమవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి డీఈవో చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంలో డీఈవో నారాయణ, హై స్కూలు హెచ్ఎం సత్యనారాయణలను కలెక్టర్ అభినందించారు.