ATP: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సహాయ కమిషనర్ గోవింద నాయక్ తెలిపారు. రాజేంద్రనగర పాలకోన్నత పాఠశాలలో ఈ పరీక్షలు 3 విడతలుగా జరుగుతాయన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్స్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.