ALR: చింతపల్లి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 22న నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో ఆశాజ్యోతి ఆదివారం తెలిపారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కోరాబు అనూషాదేవి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి మండల ప్రజాప్రతినిధులు అందరూ హాజరు అవుతారని.. అధికారులు, సిబ్బంది పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.