W.G: నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.