సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రేదేశ్ అసెంబ్లీ ఫలితాలు అందిరిలో ఉత్కంఠ కొనసాగుతుంది. కూటమిదే స్పష్టమైన విజయం కనబడుతున్న సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Wishesh Hanuma Vihari to Pawan Kalyan and Chandrababu
LoksabhaResult: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రేదేశ్ అసెంబ్లీ ఫలితాలు అందిరిలో ఉత్కంఠ కొనసాగుతుంది. కూటమిదే స్పష్టమైన విజయం కనబడుతున్న సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లలో అనంతరం టీడీపీ సొంతంగా 133 స్థానాలు ఆధిక్యంలో 5 స్థానాల్లో గెలిచింది. ఇక 20 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో లీడింగ్‌లో కనిపిస్తుంది. అదేవిదంగా బీజేపీ 7 స్థానాల్లో 1 స్థానం గెలిచింది. ఇక వైసీపీ లీడింగ్‌లో ఉన్నాయి. అటు అధికార వైసీపీ 15 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కూటమి భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులు కూటమికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియన్ క్రికెటర్ హనుమా విహారి పవన్ కల్యాణ్, చంద్రబాబులను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
పది సంవత్సరాల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టుదల, ప్రణాళిక, పట్టుదలలే ఇప్పుడు అధికారం తెచ్చి పెడుతోందని ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైసీపీని ఉద్దేశిస్తూ ‘కర్మ ఎప్పుడూ విఫలం కాదు’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అలాగే సాయి ధరమ్ తేజ్ సైతం మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడిన వీడియోను జత చేస్తూ పోస్ట్ చేశారు. ప్రముఖ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు హరీష్ శంకర్ సైతం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.