somireddy chandramohan reddy:ఏపీలో ముఖ్య నేతలు పాదయాత్రల బాట పట్టారు. లోకేశ్ (lokesh) యువగళంతో కదం తొక్కారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభతో జనానికి దగ్గర అవుతున్నారు. నిన్న (శుక్రవారం ) చంద్రబాబును (chandrababu) అనపర్తిలో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కాలినడకన సభా స్థలికి చేరుకున్నారు. ఈ ఇష్యూపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ సర్కార్కు పోయే కాలం దగ్గర పడిందని టీడీపీ ముక్య నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) అన్నారు.
జగ్గంపేట(jaggampeta), పెద్దాపురంలో (peddapuram) చంద్రబాబు (chandrababu) సభలకు వచ్చిన స్పందన చూసి తట్టుకోలేకపోతున్నారని కామెంట్ చేశారు. అందుకే అనపర్తిలో అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. జగన్ (jagan) సర్కార్కు పోయే కాలం దగ్గర పడిందని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. అందుకే ఇలా అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఏపీలో నియంతృత్వ, నిరంకుశ, దుర్మార్గపు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. జగన్ (jagan), ఆయన సోదరి షర్మిల (sharmila), తల్లి విజయమ్మ (vijayamma) పాదయాత్రలు చేస్తే అడ్డుకున్నామా అని అడిగారు. రోడ్లపై అడ్డంగా నిలబడి పచ్చి అబద్ధాలు చెప్పినా అడ్డుకోలేదని చెప్పారు. మరి మీరు ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగారు.
జగన్కు (jagan) ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే.. ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని సోమిరెడ్డి (somireddy) నిలదీశారు. ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని స్పష్టంచేశారు.
వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలలో ఏపీ అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. అయినప్పటికీ ముందుగానే లోకేశ్ (lokesh) జనాల్లోకి వెళ్లారు. పవన్ కల్యాణ్ (pawan kalyan) కూడా వారాహి వాహనంలో యాత్ర చేపడతారు. వీలునుబట్టి చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. జగన్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అంటున్నారు. ప్రతిపక్ష నేతలపై నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.