CTR: ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు పేర్కొన్నారు. పుంగనూరులోని అగ్నిమాపక కార్యాలయంలో శుక్రవారం ఆయన కేసి టీవీతో మాట్లాడారు. వేసవి ఎండలు ప్రారంభమవుతున్నాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువని, వాటి నివారణకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాలు జరిగితే 08581-253101 సమాచారం ఇవ్వాలన్నారు.
VZM: రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డా. వై కళ్యాణ్ చక్రవర్తి పోలియో నిర్మూలనే రోటరీ ధ్యేయమని శుక్రవారం తెలిపారు. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేపట్టి బొబ్బిలిలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశాన్ని 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించారని, దీనిపై అప్రమత్తత అవసరమన్నారు. అనంతరం క్లబ్ కార్యక్రమాలు సమీక్షించి రోటరీ బస్ బే ప్రారంభించి, విద్యార్థులకు టీ షర్టులు పంచారు.
KDP: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎస్సై హారిక అన్నారు. శుక్రవారం సిద్ధవటం పోలీస్ స్టేషన్ వద్ద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాల్యవివాహా విముక్తి ప్రచార రథాన్ని ఎస్సై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలకు బాల్య వయసులో వివాహాలు చేయడం పట్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు.
NLR: దగదర్తి మండలం పెదపుతేడు గ్రామంలో పంట నమోదు కార్యక్రమంను సీహెచ్ నాగరాజు సహాయ వ్యవసాయ సంచాలకులు కావలి శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు కార్యక్రమంలో నమోదవ్వాలన్నారు. తద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పంట అమ్ముకోవచ్చన్నారు. ప్రభుత్వం ద్వారా లభించే ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర ప్రభుత్వ పథకాలన్నిటికీ అర్హులవుతారని ఆయన తెలిపారు.
E.G: కడియం మండలం మాధవ రాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై నిందలు వేస్తే సహించేది లేదని ఆ గ్రామానికి చెందిన SC, ST ఐక్యవేదిక నాయకులు శుక్రవారం హెచ్చరించారు. చైతన్యనగర్లో తలెత్తిన భూ వివాదం ఆయన వ్యక్తిగతం కాదన్నారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు సర్పంచ్‌పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలవురు నాయకులు పాల్గొన్నారు.
ATP: అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ శుక్రవారం భూసేకరణ, భూమి బదలాయింపు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులతో కలిసి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిని ఆయన చర్చించారు. పెండింగ్‌లో ఉన్న భూమి బదలాయింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణా: అసెంబ్లీలో శుక్రవారం MLA యార్లగడ్డ వెంకట్రావు APకి ప్రత్యేక స్టాంప్ చట్టం తీసుకురావాలని సూచించారు. పాసుపుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకోవడాన్ని ఆయన విమర్శించారు. రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తూ, విజయవాడ రూరల్‌లో 10 ఎకరాల భూమితో కృష్ణా యూనివర్సిటీ ఫైలు వేగవంతం చేయాలని కోరారు. MRO రికార్డు ట్యాంపరింగ్‌పై విచారణ చేయాలని కోరారు.
VSP: భారత నౌకాదళాధిపతి దినేష్ కే. త్రిపాఠి సింగపూర్ నౌకాదళాధిపతి షాన్ వాట్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నౌకాదళాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ముఖ్యంగా ‘సింబెక్స్ విన్యాసాలు, అలాగే ‘ఎక్సర్‌సైజ్ పసిఫిక్ రీచ్ 2025’లో సబ్‌మరైన్ శోధన–రక్షణ సహకారంపై దృష్టి సారించారు.
ప్రకాశం: కంభంలో ఇవాళ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పురుగు మందుల షాపు లైసెన్స్ మంజూరు కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కంభం మండల వ్యవసాయాధికారి షేక్ మహమ్మద్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ దాడులను అధికారులు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
PLD: ఆర్టీఈ (RTE) చట్టం కింద 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు నూజెండ్ల ఎంఈవో రవిచంద్ర శుక్రవారం తెలిపారు. అర్హులైన పేద విద్యార్థులు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కోదండ స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో స్వామివారికి తిరుకల్యాణోత్సవం, అగ్ని ప్రతిష్ట, తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కసాపురం ఆలయ ఈవో విజయరాజు, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: నల్లమడ మండలంలోని గోపేపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన తోలేటి ప్రభావతమ్మకు చెందిన మామిడి తోట ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఏడాది పూత బాగా రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతుకు, ఈ ఘటన తీరని వేదన మిగిల్చింది.
E.G: ఈనెల 22న రాజానగరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలిపారు. మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ ఉత్సవం & క్రియాశీలక సభ్యత్వ నమోదు, పలు కమిటీల నిర్మాణం, తదితర వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. కావున పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
NDL: జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ శుక్రవారం మధ్యాహ్నం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత కేసులు వాటి పురోగతిపై సీఐ రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నమ్మవద్దన్నారు.
ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సభలో పాల్గొన్న సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక, సామాజిక, అసమానతలు, కుల, మత వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాలన్నారు.