• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప.గో, ఏలూరు జిల్లాల్లో ఆకాశ మార్గంలో సర్వే

W.G: ఉమ్మడి జిల్లాల పరిధిలోని జలవనరుల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘లైడార్’ విమానం ద్వారా ఆకాశంలో సర్వే పనులు అత్యంత చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరి 20న నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, గణపవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం పరిసరాల్లో, 21న పేరుపాలెం, మొగల్తూరు, భీమవరం, వీరవాసరం, ఉంగుటూరు, భీమడోలు ప్రాంతాల్లో విమానం ద్వారా సర్వే జరగుతుంది.

February 20, 2026 / 09:24 AM IST

అదుపుతప్పి ఢీకొన్న ఇసుక టిప్పర్లు

KDP: శుక్రవారం కమలాపురం మండలం గొల్లపల్లి బ్రిడ్జి సమీపంలో కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగుంట్ల వైపు నుంచి వెళ్తున్న రెండు ఇసుక టిప్పర్లను వెనుక నుంచి వస్తున్న ఒక వాహనం బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం, గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

February 20, 2026 / 09:20 AM IST

బస్టాండ్‌లలో దుకాణాల కేటాయింపునకు టెండర్లు

SS: జిల్లాలోని వివిధ బస్టాండ్‌లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, చిన్న వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాలను సంప్రదించి టెండర్ నిబంధనలు, దరఖాస్తు గడువు వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 09:19 AM IST

బస్టాండ్‌లలో దుకాణాల కేటాయింపునకు టెండర్లు

SS: జిల్లాలోని వివిధ బస్టాండ్‌లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, చిన్న వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాలను సంప్రదించి టెండర్ నిబంధనలు, దరఖాస్తు గడువు వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 09:19 AM IST

‘ రేపు జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

CTR: చిత్తూరు మెప్మా-నిపుణ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నాగయ్య కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకే మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 8121212873 నంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 20, 2026 / 09:17 AM IST

దొంగతనం నెపం.. మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

VSP: బుచ్చయ్యపేట మండలం కొత్త కొండెం పూడిలో పదో తరగతి విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు కొంతమంది వెండి పట్టీలు దొంగతనం చేశారని నెపం మోపడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. కుమారుడి మృదేహాన్ని చూసి తల్లిదండ్రులు తలారి మంగపతి, భవాని కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 09:15 AM IST

కనకదుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే కాలవ

ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాయదుర్గం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 09:14 AM IST

ఈ నెల 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ

TPT: వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ తులసి జ్యోతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా మార్చి 31వ తేదీ వరకు అర్జీలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు, 27 ఫలితాలు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

February 20, 2026 / 09:12 AM IST

ఆత్మకూరులో ఈనెల 26న మెగా జాబ్ మేళా

NDL: ఈ నెల 26న ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఇవాళ తెలిపారు. 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,250 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–30 ఏళ్ల వయసు గల యువత అర్హులన్నారు. సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావాలని సూచించారు.

February 20, 2026 / 09:10 AM IST

గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

NLR: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

February 20, 2026 / 09:04 AM IST

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

CTR: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ప్రతి కేంద్రం వద్ద కళాశాల పేరు, పరీక్ష కేంద్రం నంబర్ కనిపించేలా ఫ్లెక్సీలు చేయాలన్నారు. నో సెల్‌ఫోన్ జోన్ అని విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

February 20, 2026 / 09:03 AM IST

నేడు హుండీ ఆదాయం లెక్కింపు

SKLM: జలుమూరు మండలం శ్రీ ముఖలింగం క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కె.ఏడు కొండలు గురువారం ప్రకటనలో తెలిపారు. ఆలయ నిబంధనల మేరకు దేవ దాయ శాఖ అధికారులు, పాలక మండలి, అర్చకుల సమక్షంలో లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 09:02 AM IST

నేడు సామాజిక న్యాయ దినోత్సవం

GNTR: నేడు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాలాద్రి తెలిపారు. గుంటూరులోని మల్లయ్య లింగం భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైందని, అసమానతలు పెరిగాయని విమర్శించారు.

February 20, 2026 / 09:01 AM IST

గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

NDL: బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

February 20, 2026 / 08:56 AM IST

మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

VZM: మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో జరిగింది. వన్ టౌన్ ఎస్సై ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన బెవర శ్రీనివాస్ (28) కూలీ పనులు చేస్తు జీవనం సాగించే వాడు. మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య రేవతి మందలించింది.

February 20, 2026 / 08:48 AM IST