• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కృష్ణాపురంలో కుట్టుమిషన్లు, స్ప్రే పంపుల పంపిణీ

KRNL: కోడుమూరు(M) కృష్ణాపురంలో మూడో విడత కుట్టుమిషన్లు, తైవాన్ స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. KDCC బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, MLA దస్తగిరి సహకారంతో మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు, రైతులకు తైవాన్ స్ప్రేయర్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని, రైతులు ఆధునిక పరికరాలతో దిగుబడులు పెంచుకోవాలని ఈ సందర్భంగ నాయకులు ఆకాంక్షించారు.

February 20, 2026 / 06:24 AM IST

చీటింగ్ కేసులో జైలు శిక్ష ఖరారు

NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి, ఓబులేసు అనే ఇద్దరికీ చీటింగ్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష రూ. 5000 జరిమానాను బనగానపల్లె కోర్టు విధించినట్లు ఇవాళ కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు తెలిపారు. అనంతరం ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

February 20, 2026 / 06:24 AM IST

ఎంపీ వేమిరెడ్డి పీఏ అని చెబుతున్న నకిలీ పీఏ అరెస్టు

NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏ అంటూ బెదిరింపులకు దిగిన నకిలీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం నెల్లూరు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

February 20, 2026 / 06:21 AM IST

ట్రాక్టర్ తిరగబడి యువకుడు దుర్మరణం

W.G: ఏలూరుపాడులో గురువారం జరిగిన ప్రమాదంలో తూము జాన్ సతీశ్ (27) అనే యువకుడు మృతి చెందాడు. కలిదిండి మండలం సింగరాయిపాలెంకు చెందిన సతీశ్, చెరువు గట్టు వేస్తుండగా బ్లేడు ట్రాక్టర్ అదుపుతప్పి తిరగబడింది. ఇంజిన్ కింద పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో కుటుంబంలో విషాదం నిండింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 06:20 AM IST

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SKLM: మెళియాపుట్టి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టెక్కలి డివిజనల్ విద్యుత్ అధికారి నర్సింహ కుమార్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిడ్డిమి, చాపర గ్రామీణ, పారిశ్రామిక పీడర్ల పరిధిలో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు. 

February 20, 2026 / 06:20 AM IST

యానాం ఎమ్మెల్యేకు దరియాలతిప్ప రైతుల విన్నపం

కోనసీమ: దరియాలతిప్ప పరిధిలోని పంట పొలాలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు గురువారం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక న్ను కలిశారు. సాగు నీరు అందక పోవడంతో ఎదిగిన పైరు ఎండిపోయే దశకు చేరుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే అధికారులతో మాట్లాడారు. సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు.

February 20, 2026 / 06:19 AM IST

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

PPM: జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి గురువారం కలక్టరేట్‌లో సివిల్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల, ఉపాద్యాయుల సమస్యల పరష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఏ రకమైన సమస్యలు ఉన్నా సంకోచించకుండా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 06:19 AM IST

కర్మల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.1 కోటి 64 లక్షల వ్యయంతో నిర్మించనున్న కర్మల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమా శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:17 AM IST

‘స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి’

KDP: ప్రొద్దుటూరు నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా భద్రత, గంజా నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

February 20, 2026 / 06:16 AM IST

కళ్యాణదుర్గంలో నిలిచిన ప్యాసింజర్ రైలు

ATP: రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్ రైలు కళ్యాణదుర్గం స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. గురువారం కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలులో కొద్దిదూరం వెళ్ళాక సమస్య ఏర్పడటంతో, సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేసి కళ్యాణదుర్గం స్టేషన్‌కు చేర్చారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

February 20, 2026 / 06:16 AM IST

ఎలుగుబంటి దాడి.. గ్రామస్తుల్లో భయం

అన్నమయ్య: రైల్వేకోడూరులోని బోటుమీదపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో నిన్న దేశయ్యపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గత 15 రోజులుగా ఓబులవారిపల్లె, కోడూరు మండల పరిసర గ్రామాల్లో రెండు ఎలుగుబంట్లు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. గ్రామస్తులు అటవీశాఖ చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

February 20, 2026 / 06:15 AM IST

గోరంట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ

SS: గోరంట్ల పోలీస్ స్టేషన్‌ను అడిషనల్ ఎస్పీ అంకిత సురాన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, లాకప్ గది, మహిళా హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి కేసుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరాల నియంత్రణకు రాత్రి బీట్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్సైలు రామచంద్ర, ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

February 20, 2026 / 06:12 AM IST

యువకుడిపై పోక్సో కేసు నమోదు

TPT: పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ బాలికను తిరుపతికి చెందిన యువకుడు యూసఫ్ (23) మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:12 AM IST

కోదండరామయ్య కళ్యాణానికి 110 కిలోల ముత్యాలు

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 110 కిలోల ముత్యాలను కానుకగా ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా కోవూరు MLA,TTD పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ముందుకొచ్చినట్లు డిప్యూటీ ఈవో ఏ.ప్రశాంతి గురువారం తెలిపారు.

February 20, 2026 / 06:12 AM IST

నేటి నుంచి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

CTR: చిత్తూరు మురకంబట్టులోని చిత్తూరు-పూతలపట్టు రైల్వే మార్గంలో ట్రాక్ మరమ్మతు పనులను శుక్రవారం ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రావెల్ క్రాసింగ్ నంబరు 22 పూర్తి ట్రాక్‌ను అప్ గ్రేడేషన్ చేయనుండటంతో శుక్రవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపునున్నట్లు చెప్పారు.

February 20, 2026 / 06:11 AM IST